Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 11, శ్లోకం 1

అథ ఏకాదశోధ్యాయ:
విశ్వరూపదర్శనయోగ:

1.
అర్జున ఉవాచ
మదనుగ్రహాయ పరమం
గుహ్యమధ్యాత్మసంజ్ఞితమ్‌ |
యత్త్వయోక్తం వచస్తేన
మోహోయం విగతో మమ ||

తాత్పర్యము : అర్జునుడు పలికెను : ఈ పరమ రహస్యములైన ఆధ్మాత్మిక విషయములను గూర్చి నీవు కరుణచే నాకు చేసిన ఉపదేశముల శ్రవణము ద్వారా ఇప్పుడు నా మోహము తొలగిపోయినది.

భాష్యము : గత అధ్యాయములో శ్రీకృష్ణుడే సర్వానికి మూలమని తెలుసుకొనుటచే అర్జునుని మోహము తొలగిపోయినది. అయితే అందరూ శ్రీ కృష్ణున్ని ఆ విధంగా స్వీకరించరు కనుక, అటువంటి వారికి కూడా విశ్వాసాన్ని కలుగజేయుటకు అర్జునుడు శ్రీకృష్ణున్ని తన విశ్వరూపాన్ని చూపించమని అడుగుచున్నాడు. ఆ రూపాన్ని చూసి ఎవరైనా భయము చెందుదురు కాబట్టి, అర్జునుడు శ్రీకృష్ణున్ని తిరిగి తన నిజరూపమును చూపమని కోరును. అంతేకాక అర్జునుడు శ్రీకృష్ణుడు కేవలము తన హితము కొరకే మాట్లాడుచున్నాడని, అంతా కృష్ణుని కృప వలననే సాధ్యమగుచున్నదని తెలియజేస్తాడు. ఆ విధముగా, ఈ అధ్యాయము నందు శ్రీకృష్ణుడే సర్వ కారణకారణుడని అందరి హృదయములోనూ ఉండు పరమాత్మ అని నిరూపించబడుతుంది.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement