Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 10, శ్లోకం 41
యద్యద్విభూతిమత్‌ సత్త్వం
శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం
మమ తేజోంశసంభవమ్‌ ||

తాత్పర్యము : సంపన్నములను, సుందరములను, వైభవోపేతములను అగు సమస్త సృష్టి విస్తారములు నా తేజోంశము నుండి ఉద్భవించినవిగా తెలిసికొనుము.

భాష్యము : భౌతిక, ఆధ్మాత్మిక ప్రపంచము లందు ఎటువంటి వైభవోపేతము లేదా సుందరమైనటువంటి సృష్టి ఉన్నది అంటే, అది శ్రీకృష్ణుని అంశ మాత్ర వ్యక్తీకరణయేనని మనము అర్థము చేసుకొనవలెను.కనుక విశేష వైభవముతో కూడినది ఏదైననూ శ్రీకృష్ణుని విభూతికి ప్రాతినిధ్యముగా భావించవలెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement