అధ్యాయం 10, శ్లోకం 40
40.
నాంతోస్తి మమ దివ్యానాం
విభూతీనాం పరంతప |
ఏష తూద్దేశత: ప్రోక్తో
విభూతేర్విస్తరో మయా ||
తాత్పర్యము : ఓ శత్రుంజయుడా! నా దివ్య విభూతులకు అంతమనేది లేదు. నేను నీకు తెలిపినదంతయూ నా అనంత విభూతుల యొక్క సూచన మాత్రమే.
భాష్యము : వేదాలలో పరిపరి విధాలుగా శ్రీకృష్ణుని శక్తులను, వైభవాలను వివరించుటకు ప్రయత్నించుట జరిగినది. అయితే భగవంతుని వైభవానికి ఒక హద్దు లేదు, కనుక సమస్త వైభవాలను వివరించుట సాధ్యము కాని పని. ఏదో అర్జునుని జిజ్ఞాసను సంతృప్తి పరుచుటకు శ్రీకృష్ణుడు కేవలము కొన్ని మచ్చు తునకలను మాత్రమే ఉదహరించినాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..