Thursday, November 21, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 38
38.
దండో దమయతామస్మి
నీతిరస్మి జిగీషతామ్‌ |
మౌనం చైవాస్మి గుహ్యానాం
జ్ఞానం జ్ఞానవతామహమ్‌ ||

తాత్పర్యము : నేను చట్ట విరుద్ధతను అణచువానిలో శిక్షను, జయమును కోరువానిలో నీతిని, రహస్యములలో మౌనమును, జ్ఞానవంతులలో జ్ఞానమును అయి యున్నాను.

భాష్యము : మనము అనేక పరిస్థితులచే నిరోధించబడుచూ ఉందుము. వాటిలో నేరస్థులను నిరోధించేది శిక్ష. అది శ్రీకృష్ణున్ని సూచిస్తుంది. అలాగే నీతి నిజాయితీ ఎప్పుడూ నిజమైన విజయాన్ని సాధిస్తాయి. గుహ్యమైన విషయములను శ్రవణము, స్మరణము చేయునపుడు మౌనముగా ఉండుట చాలా ముఖ్యము. అలా మౌనము వలన త్వరితగతిన పురోగతిని సాధించవచ్చును. ఏది భౌతికము, ఏది ఆధ్యాత్మికము అను విచక్షణ చేయగల జ్ఞానమే శ్రీకృష్ణుడు!

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement