అధ్యాయం 10, శ్లోకం 36
36.
ద్యూతం ఛలయతామస్మి
తేజస్తేజస్వినామహమ్ |
జయోస్మి వ్యవసాయోస్మి
సత్త్వం సత్త్వవతామహమ్ ||
తాత్పర్యము : నేను మోసములలో జూదమును, తేజస్సులలో తేజస్సునై యున్నాను. అలాగుననే జయమును, సాహసమును, బలవంతులలో బలమును నేనే.
భాష్యము : ఈ ప్రపంచ మంతటా అనేక రకాల మోసాలు జరుగుచూ ఉంటాయి. వాటిలో జూదమునకు మించినది లేదు. కాబట్టి అది కృష్ణున్ని సూచిస్తుంది. కృష్ణుడు ఎవరినైనా మోసము చేయవలెననుకుంటే ఎవరూ అతనిని అధిగమించలేరు. ఈ విధముగా ఆయన అన్ని రంగాలలోనూ గొప్పవాడు. అంతేకాక కృష్ణుడు అత్యంత తేజోవంతుడుగా, అజేయుడుగా, సాహసోపేతుడుగా, అమిత బలశాలిగా తన లీలల ద్వారా నిరూపించి ఉన్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..