అధ్యాయం 10, శ్లోకం 34
34.
మృత్యు: సర్వహరశ్చాహమ్
ఉద్భవశ్చ భవిష్యతామ్ |
కీర్తి : శ్రీర్వాక్చ నారీణాం
స్మృతిర్మేధా ధృతి: క్షమా ||
తాత్పర్యము : సమస్తమును మ్రింగివేయునటువంటి మృత్యువును మరియు సృష్టింపబడనున్న జీవులకు ఉద్భవమును నేనే అయి యున్నాను. స్త్రీలయందలి యశస్సు, వైభము, మనోహరమగు వాక్కు, జ్ఞాపకశక్తి, బుద్ధి, ధృతి, ఓర్పును నేనే.
భాష్యము : మనిషి పుట్టుకతోనే క్షణక్షణమూ కొంత నశిస్తూ ఉంటారు. మృత్యువు కాలరూపములో మనల్ని ఎప్పుడూ కబళిస్తూనే ఉంటుంది. దాని చివరి రూపాన్ని మృత్యువు అని అందురు. అది కృష్ణున్ని సూచిస్తుంది. భవిష్యత్తు అనేది పుట్టుక, ఎదుగుదల, పోషణ, సంతానోత్పత్తి, ముసలితనము చివరికి మృత్యువుగా మారుతుంది. కాని ఇవన్నీ జరగాలంటే ముందు జీవి తల్లి గర్భము నుండి బయటపడవలసి ఉంటుంది. అది కృష్ణున్ని సూచిస్తుంది. ఇక్కడ కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేథా, ధృతి, క్షమా అను ఏడు స్త్రీ ల క్షణాలు తెలియజేయబడినవి. అవి ఏ మాత్రము ఒక వ్యక్తిలో ఉన్నా, అతడు గొప్పవాడుగా పరిగణించబడతాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..