Sunday, November 24, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 33
33.
అక్షరాణామకారోస్మి
ద్వంద్వ: సామాసికస్య చ |
అహమేవాక్షయ: కాలో
ధాతాహం విశ్వతోముఖ: ||

తాత్పర్యము : నేను అక్షరములలో ‘అ’ కారమును, సమాసములలో ద్వంద్వసమాసమును, శాశ్వతమైన కాలమును, సృష్టికర్తలలో బ్రహ్మను అయి యున్నాను.

భాష్యము : వేద అక్షరాలు ‘అ’ కారముతో మొదలవుతాయి. ‘అ’ కారము లేకుండా మనము దేవినీ ఉచ్చరించలేము. కాబట్టి ‘అ’ కారము కృష్ణున్ని సూచిస్తుంది. సంస్కృతభాషలో అనేక సమాసాలున్నాయి అయితే ద్వంద్వము ఉత్తమమైనది. ‘రామ-కృష్ణ’ అను పదములో ‘రామ’, ‘కృష్ణ’ అను పదాలకు ఒకే రూపము ఉండుటను ద్వంద్వము అందురు. కాలము అన్నింటినీ హరించి వేస్తుంది. చివరకు ప్రళయమును కూడా సంభవింప చేస్తుంది. ఇలా కాలము కృష్ణున్ని సూచిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ, సృష్టి కర్తలందరిలోకి గొప్పవాడు కాబట్టి ఆయన శ్రీకృష్ణున్ని సూచిస్తాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement