Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 30
30.
ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం
కాల: కలయతామహమ్‌ |
మృగాణాం చ మృగేంద్రోహం
వైనతేయశ్చ పక్షిణామ్‌ ||

తాత్పర్యము : నేను దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, అణచువారిలో కాలమును, మృగములలో సింహమును, పక్షులలో గరుత్మంతుడను అయి యున్నాను.

భాష్యము : దైత్యులు లేదా దానవులు నాస్తికులు. అయితే అటువంటి నాస్తిక కుటుంబంలో పుట్టి గొప్ప భక్తుడైన ప్రహ్లాదుడు శ్రీకృష్ణుని ప్రతినిధి. అనేకమంది వేరే వారిని అణగదోక్కుచూ ఉందురు. కాని కాలము ఈ విశ్వములో అన్నింటిని అణచివేస్తుంది. జంతువులలో సింహము అత్యంత బలమైనది మరియూ వీరొచితమైనది. అలాగే అనేక లక్షల కొలదీ పక్షులలో, విష్ణువు వాహనమైన గరుడుడు ఉత్తముడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement