Tuesday, November 26, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 12.

యుక్త: కర్మఫలం త్యక్త్వా
శాంతిమాప్నోతి నైష్ఠికీమ్‌ |
అయుక్త: కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే ||

తాత్పర్యము : స్థిరమైన భక్తిని కలిగినవాడు సర్వ కర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. కాని భగవద్భావనము లేని వాడును మరియు తన కర్మ ఫలముల యెడ ఆసక్తిని కలిగి యున్నవాడును అగు మనుజుడు బ ద్ధుడగును.

భాష్యము : కృష్ణ చైతన్యవంతుడు కృష్ణుడికి ఆకర్షితుడైతే, శరీర చైతన్యము కల వ్యక్త్తి ఫలాసక్తిని కలిగి ఉంటాడు. కష్ణుడి పట్ల ఆకర్షణమనేది వ్యక్తిని ముక్తుడ్ని చేసి శాంతిని కలుగజేస్తుంది. ఎందువలనంటే కృష్ణుడు ఎప్పుడూ అందరికీ మంచే చేస్తాడు. మన జీవితములో ఏది జరిగినా అది కృష్ణుడు మన మంచి కోసమే చేశాడు అనే భావనతో ఉన్నప్పుడు ద్వంద్వాలకు అతీతముగా నుండి శాంతిని పొందవచ్చును. అలా కాకా శరీర భావనలో ఫలాసక్తి కలిగినవారు ఇంద్రియ తృప్తికి భంగము వాటిల్లునేమోనని భయాందోళనతో ఉందురు. కాబట్టి కృష్ణుడు తప్ప అన్యమైన శక్తి ఏదీ లేదని తెలుసుకున్నవాడు ప్రశాంతతను, అభయమును పొందగలడు, ఇదే కష్ణ చైెతన్య రహస్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement