Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 29
29.
అనంతశ్చాస్మి నాగానాం
వరుణో యాదసామహమ్‌ |
పితౄణామర్యమా చాస్మి
యమ: సంయమతామహమ్‌ ||

తాత్పర్యము : నేను పెక్కు పడగలు గల నాగులలో అనంతుడను, జలవాసులలో వరుణదేవుడను, పితృదేవతలలో అర్యముడను, ధర్మ నిర్వాహకులలో మృత్యు దేవతయైన యముడను అయి యున్నాను.

భాష్యము : అనేక పడగలు కలిగిన నాగులలో అనంతుడు ఉన్నతుడు. అలాగే జల చరాలలో వరుణుడు ఉన్నతుడు. అలా వారు శ్రీకృష్ణుని ప్రతినిధులు. పితృలోక అధిపతి యైన అర్యముడు కృష్ణుని సూచించును. శిక్షించు వారిలో యమధర్మరాజు ఉత్తముడు. ఆయన లోకము మన భూలోకానికి దగ్గరలోనే వుండి, పాపులను అక్కడకు తీసుకువెళ్ళి రకరకాలుగా శిక్షించును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement