అధ్యాయం 10, శ్లోకం 28
28.
ఆయుధానామహం వజ్రం
ధేనూనామస్మి కామధుక్ |
ప్రజనశ్చాస్మి కందర్ప:
సర్పాణామస్మి వాసుకి: ||
తాత్పర్యము : నేను ఆయుధములలో వజ్రాయుధమును, గోవులలో కామధేనువును, ప్రజోత్పత్తి కారణములలో మన్మధుడను మరియు సర్పములలో వాసుకిని అయి యున్నాను.
భాష్యము : ఆయుధాలలో వజ్రాయుధము చాలా శక్తివంతమైనది కాబట్టి అది కృష్ణున్ని సూచిస్తుంది. కృష్ణ లోకములో కృష్ణుడు అనేక సురభి ఆవులను పోషిస్తూ ఉంటాడు. అవి ఎప్పుడు కావాలంటే అప్పుడు పాలనిస్తాయి. ఈ భౌతిక ప్రపంచములో అట్టి గోవులను చూడజాలము. మంచి పిల్లలను కనుటకు మాత్రమే మైథునమును ఉపయోగించిన దానిని కందర ్ప అందురు. అది కృష్ణుని ప్రతినిధి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..