అధ్యాయం 10, శ్లోకం 27
27.
ఉచ్చై:శ్రవసమవ్వానాం
విద్ధి మామమృతోద్భవమ్ |
ఐరావతం గజేంద్రాణాం
నరాణాం చ నరాధిపమ్ ||
తాత్పర్యము : అశ్వములలో అమృతము కొరకై సాగరమంథనము కావించిన సమయమున ఉద్భవించిన ఉచ్చైశ్రవముగా నన్నెరుగుము. అలాగుననే నేను గజరాజులలో ఐరావతమును మరియు నరులలో రాజును అయి యున్నాను.
భాష్యము : ఉచ్చైశ్రవము మరియు ఐరావతము పాల సముద్ర మంథన సమయమున అమృతము నుండి పుట్టుటచే అవి ప్రత్యేకమైనవి, ఆ విధముగా శ్రీకృష్ణున్ని సూచిస్తున్నాయి. విశ్వాన్ని పోషించే బాధ్యత శ్రీకృష్ణునిది కనుక రాజు ఆ భాధ్యతను కృష్ణుని తరపున నిర్వహిస్తాడు. కాబట్టి అతడు కృష్ణుని ప్రతినిధి. భగవంతుని లక్షణాలు కలిగి విశ్వాన్ని పాలించిన యుధిష్టర మహారాజు, పరీక్షిన్మహరాజు మరియు రామచంద్రుడు మంచి రాజులుగా ఉండి ప్రజా సంక్షేమాన్ని ఎల్లప్పుడూ తలంచేవారు. కానీ నేటి కలియుగమున అన్ని నియమాలు కలుషితమై రాజాధిపత్యము క్షీణించి, చివరకు తొలగించబడినది. అయితే ఒకప్పుడు సరైన రాజుల పరిపాలనలో ప్రజలు మరింత ఆనందముగా ఉన్నారనే విషయాన్ని మన ము మరచిపోకూడదు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..