Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 10, శ్లోకం 26
26.
అశ్వత్థ: సర్వవృక్షాణాం
దేవర్షీణాం చ నారద: |
గంధర్వాణాం చిత్రరథ:
సిద్ధానాం కపిలో ముని: ||

తాత్పర్యము : నేను వృక్షములలలో మర్రి చెట్టును, దేవర్షులలో నారదుడను, గంధర్వులలో చిత్రరథుడను, సిద్ధులలో కపిలుడను అయి యున్నాను.

భాష్యము : మర్రి చెట్టు వృక్షాలన్నింటిలోకి ఎత్తయినది మరియు ఎంతో అందమైనది, పూజించబడేది. దేవతలలో నారదుడు ఉత్తమమైన భక్తుడు. అలా నారదముని భగవంతుని భక్తావతారము. గంధర్వులు గొప్పగాయకులు,వారిలో చిత్రరథుడు ఉత్తముడు. కపిల భగవానుడు కృష్ణుని అవతారము. ఆయన భోధనలు శ్రీమద్భాగవతము నందు పొందుపరుచబడినవి.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement