అధ్యాయం 10, శ్లోకం 23
23.
రుద్రాణాం శంకరశ్చాస్మి
విత్తేశో యక్షరక్షసామ్ |
మసూనాం పావకశ్చాస్మి
మేరు: శిఖరిణామహమ్ ||
తాత్పర్యము :నేను రుద్రులలో శివుడను, యక్ష, రాక్షసులలో కుబేరుడను, వసువులలో అగ్నిని, పర్వతములలో మేరువును అయి యున్నాను.
భాష్యము : పదకొందు రుద్రులలో శివుడు ముఖ్యుడు. ఆ మహాదేవుడు ఈ విశ్వములో తమో గుణానికి అధిపతి. అలా అతడు భగవంతుని విస్తార రూపము. యక్షరాక్షసుల రాజు కుబేరుడు, దేవతల కోశాధికారి. ఆ విధముగా అతడు భగవంతుని ప్రతినిధి. సహజ వనరులకు, సంపదలకు పేరు గాంచినది మేరు పర్వతము. అలా ఆ పర్వతము భగవంతుని ప్రతినిధి.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..