Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 22
22.
వేదానాం సామవేదోస్మి
దేవానామస్మి వాసవ: |
ఇంద్రియాణాం మనశ్చాస్మి
భూతానామస్మి చేతనా ||

తాత్పర్యము : నేను వేదములలో సామవేదమును, దేవతలలో స్వర్గాధిపతియైన ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, జీవుల యంద లి ప్రాణమును (చైతన్యమును) అయి యున్నాను.

భాష్యము : ఆత్మకు మరియు భౌతికమైన శరీరానికి గల భేధము ఏమిటంటే ఆత్మకు చైతన్యము ఉంటుంది కాబట్టి అది ఉన్నతమైనది మరియు శాశ్వతమైనది. కాని భౌతిక పదార్థమునకు చైతన్యము ఉండదు. కాబట్టి భౌతిక పదార్థముల కలయికల చేత ఎన్నటికీ చైతన్యము ఉద్భవించదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement