అధ్యాయం 10, శ్లోకం 21
21.
ఆదిత్యానామహం విష్ణు:
జ్యోతిషాం రవిరంశుమాన్ |
మరీచిర్మరుతామస్మి
నక్షత్రాణామహం శశీ ||
తాత్పర్యము : నేను ఆదిత్యులలో విష్ణువును, తేజస్సులలో ప్రకాశమానమైన సూర్యుడను, మరుత్తులలో మరీచిని, నక్షత్రములలో చంద్రుడనై యున్నాను.
భాష్యము : ఆదిత్యులు పన్నెండు మంది వారిలో కృష్ణుడు ముఖ్‌యుడు. వెలుతురు ఇచ్చే వాటన్నింఒటిలోకీ సూర్యుడే ప్రముఖుడు. బ్రహ్మ సంహితలో సూర్యుడు భగవంతుని నేత్రము వంటి వాడు అని తెలియజేయబడినది. అలాగే యాభై రకాల గాలులు వీస్తే వాటిని నియంత్రించే దేవత అయిన మరీచి భగవంతునికి ప్రాతినిధ్యము వహిస్తాడు. అలాగే నక్షత్రాలు అనేకముగా మనకు ఆకాశములో కనిపిస్తే వాటన్నింటిలోకీ ఉత్తమము, చంద్రుడు, కృష్ణుని ప్రతినిధి. దీనిని బట్టి నక్షత్రాలు చంద్రుని వంటివని, సూర్యుని వంటివి కావని, విశ్వానికి ఒక్కడే సూర్యుడు ఉంటాడని గమనించవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..