Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకం 19
19.
శ్రీ భగవాన్‌ ఉవాచ
హంత తే కథయిష్యామి
దివ్యా హ్యాత్మవిభూతయ: |
ప్రాధాన్యత: కురుశ్రేష్ఠ
నాస్త్యంతో విస్తరస్య మే ||

తాత్పర్యము : శ్రీకృష్ణభగవానుడు ఇట్లు పలికెను : నా వైభవోపేతమైన సృష్టి విస్తారములను గూర్చి నీకు తెలియజేసెదను. కాని ఓ అర్జునా! నా విభూతి అనంతమైనందున కేవలము వానిలో ప్రధానమైన వానినే నేను నీకు తెలుపెదును.

భాష్యము : బద్ధ జీవుని ఇంద్రియాలు లోపాలతో కూడుకొని ఉన్నవి కాబ ట్టి శ్రీకృష్ణుని లీలలను అర్థము చేసుకొనుట సాధ్యము కాదు. అయితే భక్తులు మాత్రం భగవంతున్ని అర్థము చేసుకోవటమ కంటే ఆయన లీలలు వారికి మధురంగా ఉంటాయి కాబట్టి ఆయనను గురించి ఆయన శక్తుల గురించి వింటూ ఉండిపోతారు. శ్రీకృష్ణుని శక్తులు భౌతిక ఆధ్మాత్మిక జగత్తులంతటా విస్తరించి ఉన్నాయి. శుద్ధ భక్తులు వాటిని చర్చిస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణుడు, సామాన్య మానవుడు గమనించగల విభూతులను మాత్రమే తెలియజేస్తున్నాడు. ‘విభూతి’ అనగా ప్రత్యేకమైన శక్తి లేదా భౌతిక నియంత్రణా శక్తి అని అర్థము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో

Advertisement

తాజా వార్తలు

Advertisement