అధ్యాయం 10, శ్లోకం 18
18.
విస్తరేణాత్మనో యోగం
విభూతిం చ జనార్దన |
భూయ: కథయ తృప్తిర్హి
శృణ్వతో నాస్తి మే మృతమ్ ||
తాత్పర్యము : ఓ జనార్ధనా! నీ యోగ విభూతిని దయతో తిరిగి సమగ్రముగా వివరింపుము. ఎంత అధికముగా శ్రవణము చేసినచో అంత అధికముగా నీ వచనామృతమును నేను ఆస్వాదింపగోరినందున నిన్ను గూర్చి ఎంత శ్రవణము చేసినను తనవితీరుట లేదు.
భాష్యము : మనము సినిమాలు ఆని, నవలలు గాని లేదా వార్తలను గాని కొన్ని సార్లు విన్న తరువాత లేదా చదివిన తరువాత విసుగు చెంది వేరే వాటిని కోరుకుంటాము. అదే శ్రీకృష్ణుని లీలలను వేదాలలో వర్ణించినట్లు విన్నట్లయితే మనకు ఎప్పటికీ తనివి తీరదు. అర్జునునికి అటువంటి దివ్యమైన సంబంధము ఉన్నది కాబట్టి అడుగడుగునా తాను శ్రీకృష్ణుని సాంగత్యాన్ని అస్వాదిస్తూ ఉన్నాడు. మనము కూడా అనుభవ పూర్వకముగా ఆ అమృతాన్ని గ్రోలవచ్చును. ఉదాహరణకు పురాణాలలో కోట్ల కొలదీ సంవత్సరాలకు పూర్వము జరిగిన భగవదవతారాల లీలలను ఇప్పటికీ మనము నిత్య నూతనముగా చర్చించుకొనవచ్చును.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..