అధ్యాయం 10, శ్లోకం 17
17
కథం విద్యామహం యోగిన్
త్వాం సదా పరిచింతయన్ |
కేషు కేషు చ భావేషు
చింత్యోసి భగవన్ మయా: ||
తాత్పర్యము : ఓ కృష్ణా! యోగీశ్వరా! నిన్ను సర్వదా నేనెట్లు చింతించగలను మరియు నిన్నెట్లు తెలిసికొనగలను? ఓ దేవదేవా! ఏ యే రూపములందు నిన్ను స్మరింపవలెను?
భాష్యము : అర్జునుడు, శ్రీకృష్ణున్ని శరణు పొందెను కాబట్టి, శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే విషయము సుస్పష్టమే. కానీ ఆయన అంతటా ఎలా వ్యాపించి ఉన్నాడో, ఆ పద్ధతిని సామాన్య మానవునికి సైతము తెలియజేయుట కోసము ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. ఒక వైష్నవుడుగా అర్జునుడు కరుణతో సామాన్య మానవుడు, ఇంకా చెప్పాలటే దానవులు మరియు నాస్తికులు సైతమూ ఎలా దీని ని గ్రహించలరు అని ఆలోచించి ఈ ప్రశ్నను అడిగినాడు. అందుకే ‘యోగిన్’ అని శ్రీకృష్ణున్ని సంభోధించినాడు. అనగా యోగమాయా శక్తిని నియంత్రించును అని. వారు కృష్ణున్ని ప్రేమించరు కనుక కృష్ణుడు ఏ విధముగా భౌతికముగా వ్యక్తమయి ఉన్నాడో తెలుసుకుంటే వారు తమ మనస్సులను ఆ భౌతిక వస్తవులపై నిమగ్నము చేసే అవకాశమును కలుగజేయుటకు ”కేషు కేషు చ భావేషు” అని ప్రశ్నించినాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో