అధ్యాయం 10, శ్లోకం 16
16
వక్తుమర్హస్యశేషేణ
దివ్యా హ్యాత్మవిభూతయ: |
యాభిర్విభూతిభిర్లోకాన్
ఇమాంస్త్వం వ్యాప్య తిష్ఠసి ||
తాత్పర్యము : నీవు నీ విభూతుల ద్వారా ఈ లోకములన్నింటి యందును ఎలా వ్యాపించియుందువో వాటన్నింటిని దయతో నాకు విశదముగా తెలియజేయుము.
భాష్యము : కృష్ణుడు ప్రసాదించిన అన్ని అవకాశాల ద్వారా అనగా స్వయముగా శ్రీకృష్ణునితో సాంగత్యము చేయుట ద్వారా, తెలివితేటల ద్వారా, బుద్ధి ద్వారా, జ్ఞానము ద్వారా అర్జునుడు. శ్రీకృష్ణుడు దేవాదిదేవుడనే నిర్ధారణకు వచ్చినాడు. తనకంటూ ఏమీ సందేహము లేకపోయినప్పటికీ సామాన్య మానవుని కోసము ప్రత్యేకించి నిరాకారవాదుల కోసము ఈ ప్రశ్నను అడుగుచున్నాడు. వారు భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉండి కూడా ఒక వ్యక్తిగాఎలా ఉటాడో అర్థం చేసుకొనలేరు. కాబట్టి వారి శ్రేయస్సు కోరి శ్రీకృష్ణున్ని అర్జునుడు ఈ ప్రశ్నను అడుగుచున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..