Wednesday, November 20, 2024

గీతాసారం… (ఆడియోతో…)


అధ్యాయం 10, శ్లోకాలు 12,13
12.
అర్జున ఉవాచ
పరం బ్రహ్మ పరం ధామ
పవిత్రం పరమం భ వాన్‌ |
పురుషం శాశ్వతం దివ్యమ్‌ ||

13.
ఆహుస్త్వాన్‌ ఋషయ: సర్వే
దేవర్షిర్నారద స్తథా |
అసితో దేవలో వ్యాస:
స్వయం చైవ బ్రవీషి మే ||

12,13
తాత్పర్యము : అర్జునుడు ఇట్లు పలికెను : నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పవి త్రుడవు, పరతత్త్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆదిపురుషుడవు, పుట్టుకలేనివాడవు, ఘనమైనవాడవు అయియున్నావు. నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసుడు వంటి మహాఋషులందరూ నిన్ను గూర్చిన ఈ సత్యమునే ధ్రువపరచి ఉన్నారు. ఇప్పుడు స్వయముగా నీవు అదే విషయమును నాకు తెలియజేయుచున్నావు.

భాష్యము : భగవద్గీతా సారాంశమైన గడచిన నాలుగు శ్లోకములను విన్న తరువాత అర్జునుడు ”ఓ కృష్ణా, నీవే పరబ్రహ్మవు, దేవాది దేవుడవు” అని నిస్సందేహముగా వెల్లడి చేసినాడు. అయితే అర్జునుడు స్నేహితుడు కాబట్టి కృష్ణున్ని అలా పొగుడుచున్నాడు అని మనముఅనుకోకూడదు. నారదుడు లాంటి గొప్ప భక్తులు, పురాణాలు, ఇతిహాసాలు మరియు వేదాలు అర్జునుడు చెప్పిన దానిని సమర్దిస్తూ ఉన్నాయి. కృష్ణుని కృపవలనే అర్జునుడు శ్రీకృష్ణుడు దేవాదిదేవుడని గ్రహించ గలిగాడు. మనము కూడా గురుపరంపరలో భగవద్భక్తి చేసినట్లయితే శ్రీకృష్ణున్ని ఇదే విధముగా అర్ధము చేసుకొనగలుగుతాము. దురదృస్ణవశాత్తు శాస్త్రాలను చదివే తత్త్వవాదులు గురుపరంపరలో జ్ఞానాన్ని స్వీకరింపక శ్రీకృష్ణుడు సామాన్యుడనే మొండి వాదనను కొనసాగిస్తూ ఉంటారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement