అధ్యాయం 10, శ్లోకం 9
9.
మచ్చిత్తా మద్గతప్రాణా:
భోధయంత: పరస్పరమ్ |
కథయంతశ్చ మాం నిత్యం
తుష్‌తి చ రమంతి చ ||
తాత్పర్యము : నా శుద్ధభక్తుల ఆలోచనలు నా యందే నిమగ్నమై, వారి జీవితములు సంపూర్ణముగా నా సేవ కొరకే అర్పణమై యుండును. వారు నా గురించి ఒకరికొకరు బోధించుకొనుచు, చర్చించుకొనుచు గొప్ప సంతృప్తిని, ఆనందమును అనుభవింతురు.
భాష్యము : శుద్ధ భక్తుల లక్షణములు ఈ శ్లోకములో ప్రత్యేకముగా తెలుపబడినవి. వారు సదా శ్రీకృష్ణుని గుణగనాలను, లీలలను కీర్తిస్తూ వేరే భక్తులతో చర్చిస్తూ ఆనందమును పొందుచూ ఉందురు. ఇటువంటి భక్తి బీజము శుద్ధ భక్తుల సాంగత్యములోనే అంకురిస్తుంది. శ్రవణ కీర్తనాదులతో ప్రత్యేకించి ”హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే” ఉచ్చారణతో వృద్ధి చెంది లతలా ఎదిగి చివరకు శ్రీకృష్ణుని పాదాల చెంత చేరుతుంది. ఆ విధమైన ప్రేమ పొందిన భక్తుడు నీటిని విడిచి ఉండలేని చేపవలే, శ్రీకృష్ణుని మరచి ఉండలేడు. అంతేకాక అతడు శ్రీమద్భాగవతమందు భగవంతుని లీలల పట్ల, భక్తుల లీలల పట్ల గాఢమైన ఆకర్షణను కలిగి ఉంటాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో