అధ్యాయం 5, శ్లోకం 10.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి
సంగం త్యక్త్వా కరోతి య: |
లిప్యతే న స పాపేన
పద్మపత్రమివాంభసా ||
తాత్పర్యము : ఫలముల నన్నింటిని భగవానునకు అర్పించి సంగత్వము లేకుండా తన ధర్మమును నిర్వహించువాడు తామరాకు నీటిచే అంట బడనట్లుగా పాప కర్మలచే ప్రభావితుడు కాడు.
భాష్యము : ఇక్కడ ”బ్రహ్మణి” అనగా ”కృష్ణచైతన్యము” అని అర్థము. ఈ భౌతిక ప్రపంచమునకు మూలము ”బ్రహ్మము” శ్రీ ఈశోపనిషత్తు నందు కూడా సర్వమూ పరబ్రహ్మ లేదా కృష్ణునికే చందినదని సూచించబడినది. సర్వమూ భగవంతునికి చెందినట్లయితే, అన్నింటినీ భగవంతుని సేవలో వినియోగించుటయే వాటి ఉద్దేశ్యము. అదే విధముగా మన శరీరము కూడా భగవంతుని బహుమానమే, ఎప్పుడైతే దానిని భగవంతుని కార్యాలనను చేయటానికి ఉపయోగిస్తామో, అప్పుడు మనకు పాపము అంటదు. తామరాకు నీటిలో ఉన్న తడి అంటదు, అట్లే భగవంతుడే యజమాని యని, ఆయన సేవయే జీవిత లక్ష్యమని భావించే భక్తుని కార్యాలు, నా శరీరము, నా ఇంద్రియాలు అనే స్వార్థ భావనతో చేసే కార్యాలకు భిన్నమైనది, కల్మష రహితమైనది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..