Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో….)

అధ్యాయం 7, శ్లోకం 22

స తయా శ్రద్ధయా యుక్త:
తస్యారాధనమీహతే |
లభతే చ తత: కామాన్‌
మయైవ విహితాన్‌ హితాన్‌ ||
తాత్పర్యము : అట్టిశ్రద్ధను పొందినవాడై మనుజుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను నెవేర్చుకొనును. కాని వాస్తవమునకు ఆ వరముల్నియును నా చేతనే ఒసగబడుచున్నవి.

భాష్యము : భగవంతుని ఆజ్ఞ లేనిదే దేవతలు సైతమూ తమ భక్తులకు వరాలను ప్రసాదించలేరు. ఈ విషయము అల్ప జీవులకు తెలియక పోయినా
దేవతలకు బాగుగా తెలియును. తన కోరికను ఎట్టిపరిస్థితిలోనైనా తీర్చుకోవాలనుకునే వాడే ఈ విధముగా తప్పు మార్గములో దేవతలను ఆశ్రయిస్తాడు. భగవద్దామానికి తిరిగి వెళ్దామనుకునే భక్తునికి భౌతిక కోరికలు అవరోధాలవంటివి. కాబట్టి అట్టి భక్తుడు భౌతిక కోరికలతో వస్తే, వాటిని ఆయన ఇవ్వకపోగా, అటువంటి కోరికలను పోగొట్టి భగవద్దామానికి మార్గం సుగమమం చేస్తాడు. కాబట్టి కోరికలు బలంగా ఉండేవారు, భగవంతుణ్ణి ఆశ్రయించక దేవతలను ఆశ్రయిస్తారు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement