Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 13
13
చాతుర్వర్ణ్యం మయా సృష్టం
గుణకర్మవిభాగశ:
తస్య కర్తారమపి మాం
విద్ధ్యకర్తారమవ్యయమ్‌

తాత్పర్యము : ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మల ననుసరించి మానవ సంఘమునందలి నాలుగు వర్ణములు నాచే సృష్టింప బడినవి. ఈ విధానమునకు నేనే కర్తనై నను అవ్యయుడనగుటచే అకర్తగా నన్ను నీవు తెలిసికొనుము.

భాష్యము : భగవంతుడే సమస్తమునకు సృష్టికర్త. ప్రతిదియూ అతని నుండే సృష్టింపబడినది. అతని ద్వారా కొనసాగింపబడి చివరకుఅతని యందే విశ్రమించును. అలాగే చతుర్వర్ణాలు ఆయన చేతనే సృష్టింపబడినవి. ఆయన కరుణతో మనల్ని త్రిగుణాల నుండి ఉద్ధరించుటకు ఈ ఏర్పాటు చేసెనే గాని ఆయన దీని నుండి ఎటువంటి స్వప్రయోజనాన్ని ఆశించుట లేదు కనుక ఆయన దీనికి అతీతుడై ఉన్నాడు. కాబట్టి భగవదవతారములను గురించిన జ్ఞానము దివ్యమై భగవత్ప్రేమను పెంపొందించును. ఈ విధముగా మానవులను జంతు చైతన్యము నుండి ఉద్ధరించి క్రమేణా భగవత్ప్రేమను పెంపొందించుటకు వర్ణవ్యవస్థ సోపానమువలె ఏర్పాటు చేయబడినది. భగవంతునివలె భక్తుడు కూడా జాతి, దేశ, వర్గాది మానవ సంఘ విభాగములకు అతీతుడై ఉండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement