Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 09
9
జన్మ కర్మ చ మే దివ్యమ్‌
ఏవం యో వేత్తి తత్త్వత: |
త్యక్త్వా దేహం పునర్జన్మ
నైతి మామేతి సోర్జున

తాత్పర్యము : ఓ అర్జునా! నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును తెలుసుకున్నవాడు శరీర త్యాగము తరువాత తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు.

భాష్యము : భగవంతుడు ఒక్కడే అయిననూ ఆయన అనేకానేక రూపములలో తన భక్తులకు ఆనందమును కలిగించుటకు అవతరించును. ఈ వేద సత్యాన్నే ఈ శ్లోకములో భగవంతుడు సమర్థిస్తున్నాడు. మనము చేయవలసినదల్లా విశ్వాసముతో నిస్సంకోచముగా ఈ సత్యాన్ని స్వీకరించుటయే. అప్పుడు తప్పక ముక్తులమై భగవధ్దామానికి చేరగలము. మరి అక్కడనుండి తిరిగి ఈ భౌతిక ప్రపంచమునకు రావలసిన అవసరము ఉండదు. ఈ విశ్వాసము లేనిచో వేరొక మార్గము లేదు. గొప్ప పాండిత్యాన్ని, పెద్ద పదవులనూ, పేరునూ గడించవచ్చునేమో గాని భగవధ్దామమునకు మాత్రము అర్హతను పొందజాలరు. భగవంతుని కరుణకు వారు వేచి ఉండవలసిందే!
….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement