Thursday, November 21, 2024

గీతాసారం(ఆడియోతో…)

అధ్యాయం 5, శ్లోకం 14.

న కర్తృత్వం న కర్మాణి
లోకస్య సృజతి ప్రభు: |
న కర్మఫలసంయోగం
స్వభావస్తు ప్రవర్తతే ||

తాత్పర్యము : తన దేహమనెడి పురము యొక్క అధిపతియైన దేహి కర్మలను సృష్టించుటగాని, కర్మల యందు జనులను ప్రేరేపించుటగాని, కర్మ ఫలములను సృష్టించుటగాని చేయడు. ఇది యంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది.

భాష్యము : జీవుడు అజ్ఞానము వలన తనే శరీరానికి యజమానినని దానిని ఉపయోగించుకొని ఆనందించవచ్చునని భావించి బంధీయగును. కానీ వాస్తవమేమిటంటే శరీరము త్రిగుణాల ప్రభావము వలన అనేక కార్యాలు చేసి వివిధ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది. ఆ శరీరము మీద మమకారము వలన జీవి కూడా ఆ ఫలితాలకు ప్రభావితుడై ఆనందాన్ని, దు:ఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు. అయితే తాను అనుకున్నట్లు జరుగదని, తాను నియామకుడు కాదని తెలుసుకోలేక భావసాగరములో మునిగి తేలుతుంటాడు. ఎప్పుడైతే ఆ అజ్ఞానము తొలగి కృష్ణ చైతన్య నౌకలో స్థిరుడవుతాడో అప్పుడు ఈ భవ సాగరాన్ని దాటగలుగుతాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో ….

Advertisement

తాజా వార్తలు

Advertisement