Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 18, శ్లోకం 76
76.
రాజన్‌ సంస్మృత్యసంస్మృత్య
సంవాదమ్‌ ఇమమద్భుతమ్‌ |
కేశవార్జునయో: పుణ్యం
హృష్యామి చ ముహుర్ముహు: ||

తాత్పర్యము : ఓ రాజా! శ్రీకృష్ణార్జునుల నడుమ జరిగిన అద్భుతమును, పవిత్రమును అగు సంవాదమును స్మరించిన కొలది ప్రతి క్షణము పులకించుచు ఆనందము నొదుచున్నాను.

భాష్యము : కృష్ణార్జునుల సంవాదము, భగవద్గీతా అవగాహన ఎంత దివ్యమైనదంటే దానిని విన్నవారు పుణ్యుత్ములై, ఆ సంభాషణను ఎప్పటికీ మరచిపోలేరు. ఇదే ఆధ్యాత్మిక జీవితము యొక్క దివ్య మహిమ. కాబట్టి ఎవరైతే కృష్ణుని నుండిగాని, పరంపరానుగతముగా ప్రామాణిక వ్యక్తి నుండి గానీ భగవద్గీతను వినినట్లయితే సంపూర్ణ కృష్ణ చైతన్యవంతులగుదురు. అటువంటి కృష్ణ చైతన్యము యొక్క ఫలితముగా అనుక్షణమూ తరగని స్ఫూర్తిని పొందుచూ వారి జీవితము ఆనందభరితము అవుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement