అధ్యాయం 4, శ్లోకం 15
15
ఏవం జ్ఞాత్వా కృతం కర్మ
పూర్వైరపి మముక్షుభి: |
కురు కర్మైవ తస్మాత్ త్వం
పూర్వై: పూర్వతరం కృతమ్
తాత్పర్యము : పూర్వ కాలమున ముక్త పురుషులందరును నా దివ్యతత్త్వపు ఈ అవగహనతోనే కర్మలను చేసి యుండిరి. కావున నీవు కూడా వారిని అనుసరించుచు నీ కర్మ చేయుము.
భాష్యము : మానవులలో రెండు తరగతుల వారు కలరు. ఒకరి హృదయము మాలిన్యముతో కూడుకుని వుంటే, మరొకరు మాలిన్య రహితులై ఉందురు. ఇరువురికీ కృష్ణ చైతన్యము శ్రేయోదాయకమే. మలినము కలిగినవారు గురువు నిర్దేశములో నియమిత సూత్రాలను విధితో పాటించుట ద్వారా పవిత్రతను పొందుతారు. అయితే మలినము లేని వారు సైతమూ వేరేవారికి ఉదాహరణగా ఉండేటట్లు తమ కర్మలను నిర్వహిస్తూ ఇతరులను ప్రోత్సహించవచ్చును. అందువలన కృష్ణుడు, అర్జునుని యుద్ధ విర మణకు సమ్మతించలేదు సరికదా వేరేవారికి శ్రేష్ఠులు మార్గదర్శనము చూపవలసిన ఆవశ్యకత ఉందని గుర్తు చేశాడు. ఇప్పుడు ఇక్కడ కూడా పూర్వపు శిష్యులైన సూర్యదేవుని అడుగు జాడలలో నడువమని అర్జునుని ప్రోత్సహిస్తున్నాడు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..