Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 15, శ్లోకం 14
14.
అహం వైశ్వానరో భూత్వా
ప్రాణినాం దేహమాశ్రిత: |
ప్రాణాపానసమాయుక్త:
పచమ్యన్నం చతుర్విధమ్‌ ||

తాత్పర ్యము : ప్రాణుల దేహములందలి జఠరాగ్నిని నేను. ప్రాణాపానవాయువులతో కూడి నేను నాలుగు విధములైన ఆహారములను వచనము చేయుచున్నాను.

భాష్యము : ఆయుర్వేద శాస్త్రము ప్రకారము, ప్రతి వ్యక్తి కడుపులో అగ్ని ఉంటుందని మనము తీసుకున్న ఆహారాన్ని అరిగేటట్లు చేస్తుందని తెలియవచ్చుచున్నది. ఆ అగ్ని తగ్గినపుడు అరుగుదల మందగించి రోగములు వస్తాయి. ఆ జఠరాగ్ని భగవంతుని ప్రతినిధి అని ఈ శ్లోకమున తెలియజేయబడినది. బృహదారణ్యక ఉపనిషత్తులో బ్రహ్మము లేదా భగవంతుడే జఠరాగ్నిగా ఆహార పదార్ధాల అరుగుదలకు కారణమని చెప్పబడినది. వేదాంత సూత్రాలలో సైతమూ శబ్దములోనూ, శరీరములోనూ, గాలిలోనూ చివరకు కడుపులోనూ జఠరాగ్ని వలే భగవంతుడు ఉంటాడని తెలియజేయటమైనది. భగవంతుడే అరుగుదలకు కారణము కాబట్టి మనము ఆహారమును భుజించి అరిగించుకొనుటలో కూడా ఆయన పైనే ఆధారపడి ఉన్నాము. పైన పేర్కొనబడిన నాలుగు విధములైన ఆహారములు:- త్రాగబడేవి, నమలబడేవి, నాకబడేవి, పీల్చబడేవి. ఆ విధముగా ఆహారాన్ని పండించుటలో, అరిగించుకొనుటలోనూ భగవంతుని కృప వలన మనము జీవితమును ఆనందముగా గడపగలుగుచున్నాము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement