Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 20

గీతాసారం… (ఆడియోతో…)
అధ్యాయం 4, శ్లోకం 20

20
త్యక్త్వా కర్మఫలాసంగం
నిత్యతృప్తో నిరాశ్రయ: |
కర్మణ్యభిప్రవృత్తోపి
నైవ కించిత్‌ కరోతి స:

తాత్పర్యము : కర్మ ఫలముల యెడ ఆసక్తిని విడిచి ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేవాడు, నిరాశ్ర యుడును అయినవాడు అన్నిరకములగు కర్మలు చేస్తున్నప్పటికీ కామ్య కర్మలు చేయనివాడే యగును.

భాష్యము : కృష్ణుని కొరకు ప్రతిదియూ చేయుట అనే భావన కర్మ బంధము నుండి విడుదలకు అవకాశము ఇచ్చును. కృష్ణ భక్తుడు, కృష్ణున్ని ప్రేమించును కనుక కర్మఫలములందు ఆసక్తిని కలిగియుండడు. అతడు కృష్ణునిపైననే ఆధారపడి యుండుటచే స్వీయపోషనమును గురించి చింతించడు సరికదా లేనివి పొందవలెనని గాని, ఉన్న వానిని రక్షించుకొనవలెనని గాని అతడు ఆతురత పడడు. అట్లని అతడు సోమరిపోతని భావింపరాదు. కృష్ణుడు నిర్దేశించిన ధర్మాన్ని తన శాయశక్తులా చేసి ఫలితాన్ని కృష్ణునికి వదిలివేయును. కృష్ణుని పట్ల ప్రేమ లేనిదే బంధ విముక్తి అనేది సాధ్యము కాదు.

- Advertisement -

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement