Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 19

19
యస్య సర్వే సమారంభా:
కామసంకల్పవర్జితా:
జ్ఞానాగ్నిదగ్దకర్మాణం
తమాహు: పండితం బుధా:

తాత్పర్యము : ఎవని ప్రతి కర్మము ఇంద్రియ తృప్తి ఆశించకుండా ఉండునో అతడు సంపూర్ణ జ్ఞానము కలిగినట్టివాడు. కర్మ ఫలములన్నియును జ్ఞానాగ్నిచే దగ్దమైనవిగా అతడు ఋషులచే చెప్పబడును.

భాష్యము : సంపూర్ణ జ్ఞానము కలిగినవాడే భగవత్సేవలో అనేక కార్యాలలో నిమగ్నుడైన భక్తుడిని, అర్ధము చేసుకోగలుగుతాడు. ఆ విధముగా ఇంద్రియ భోగవాంఛలు లేకుండా కేవలము తాను భగవంతునికి దాసుడననే జ్ఞానముతో నుండుట వలన అతని కర్మఫలములన్నీ భగవంతునికే చెందుట వలన, కర్మ భస్మము చెందినట్లే లెక్క. అతడే నిజమైన పండితుడు. అట్టి సేవా భావము, జ్ఞానాభివృద్ధి అగ్నితో పోల్చబడినది. అది ఒక్క మారు రగిలినచో కర్మఫలములను సమూల ముగా దహింపచేయగలదు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement