Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 03

3
స ఏవాయం మయా తే ద్య
యోగ: ప్రోక్త: పురాతన: |
భక్తో సి మే సఖా చేతి
రహస్యం హ్యేతదుత్తమమ్‌

తాత్పర్యము : నీవు నా భక్తుడవు మరియు స్నేహితుడవు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్ధము చేసికొనగలవని, భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను.

భాష్యము : అర్జునుడు వంటి భక్తులు మాత్రమే భగవద్గీతా శాస్త్రాన్ని అర్ధము చేసికొనగలరని, అందుకు భిన్నముగా నాస్తిక ప్రవృత్తి కలవారు ఈ రహస్యాన్ని ఎప్పటికీ అర్ధము చేసికొనలేరని ఇచ్చట మనకు తెలియవచ్చుచున్నది. అర్జునుడు, శ్రీకృష్ణుని దేవాది దేవునిగా స్వీకరించి ఉన్నాడు. అలాగే మనము కూడా గురు పరంపర ద్వారా అర్జునుని అడుగు జాడలలో నడిచినట్లయితే ఈ మహా జ్ఞానము నుండి లాభము పొందిన వారలము అవుతాము. లేనట్లయితే మానసిక కల్పనలతో వ్రాయు భగవద్గీతల వలన మనము పెడత్రోవ పట్టే అవకాశము ఉన్నదని ఇచ్చట హెచ్చరిక చేయుచున్నారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement