రాగం : మధ్యమావతి
ఈడగుపెండ్లి ఇద్దరిజేసేము
చేడెలాల ఇది చెప్పరుగా || ||ఈడగుపెండ్లి||
పచ్చిక బయళ్ళ పడతి యాడగా
ముచ్చట కృష్ణుడు మోహించి
వెచ్చపు పూదండ వేసి వచ్చెనట
గచ్చుల నాతని కానరుగా || ||ఈడగుపెండ్లి||
ముత్తెపు ముంగిట ముదిత నడువగా
ఉత్తముడే చెలి పురమునను
చిత్తరువు వ్రాసి చెలగివచ్చె నొళ –
జొత్తుమాని ఇటు చూపరుగా || ||ఈడగుపెండ్లి||
కొత్త చవికతో కొమ్మ నిలిచితే
పొత్తున తలబాలు వోసెనట
ఇత్తల శ్రీవేంకటేశుడు నవ్వుచు
హత్తి సతి గూడె నని పాడరుగా || ||ఈడగుపెండ్లి||