Saturday, November 23, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 40
40
నేహాభిక్రమానాశో స్తి
ప్రత్యవాయో న విద్యతే |
స్వల్పమప్యస్య ధర్మస్య
త్రాయతే మహతో భయాత్‌ ||

తాత్పర్యము : ఈ ప్రయత్నము నందు నష్టము గాని, హాని గాని లేదు. ఈ మార్గమున స్వల్ప పురోగతియు మహత్తరమైన భయము నుండి మనుజుని రక్షించును.

భాష్యము : శ్రీ కృష్ణుని ప్రసన్నార్థము చేసే కార్యము , దివ్యమైనది. మన సంతృప్తి గురించి ఆలోచించకుండా చేసే అట్టి కార్యము మొదలుపెట్టినంతనే ఆటంకము లేకుండా ముందుకు కొనసాగుతుంది. కృష్ణచైతన్య కార్యము ఒకశాతం చేసి ఆపివేసినా, తరువాత రెండవశాతం నుండి కొనసాగించుటకు వచ్చే జన్మలోనైనా అవకాశము ఇవ్వబడుతుంది. భౌతిక కార్యము నూరుశాతము పూర్తి చేసినప్పుడు మాత్రమే ఫలితము లభిస్తుంది. అంతేకాక భౌతిక కార్యము, దాని ఫలితాలు ఈ జన్మతోనే అంతము అయిపోతాయి. కాబట్టి వచ్చే జన్మలోనైనా అవకాశము ఇవ్వబడుతుంది. ఇక భౌతిక కార్యము నూరుశాతము పూర్తి చేసినప్పుడు మాత్రమే ఫలితము లభిస్తుంది. అంతేకాక భౌతక కార్యము, దాని ఫలితాలు ఈ జన్మతోనే అంతము అయిపోతాయి. కాబట్టి వచ్చే జ న్మలో మళ్ళీ మొదటి నుండి ప్రారంభించవలసి ఉంటుంది. కాబట్టి కృష్ణచైతన్య కార్యములను తప్పక ఆరంభించవలెను. పతనము అయినా మళ్ళీ మానవ జన్మ లభించి బ్రాహ్మణుల లేదా ధనికుల కుటుంబాలలో పుట్టి కొనసాగించే అవకాశము ఇవ్వబడుతుంది.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement