Friday, November 22, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 2, శ్లోకం 26
26
అథ చైనం నిత్యజాతం
నిత్యం వా మన్యసే మృతమ్‌ |
తథాపి త్వం మహాబాహో
నైవం శోచితుమర్హసి ||

తాత్పర్యము : ఓ మహాబాహో ! ఒకవేళ నీవీ ఆత్మ (లేదా జీవలక్షణములు) ఎల్లప్పుడును పుట్టుచు, మరణించునని తలచినను దు:ఖించుటకు ఎట్టి కారణము లేదు.

భాష్యము : కొందరు తత్త్వవాదులు భౌతిక మూలకాల సమ్మేళనము ద్వారా ఒకానొక సమయములో ఆత్మ జన్మించునని భావించుదురు. ఆధునిక శాస్త్రజ్ఞులు, భౌతికతత్త్వ వాదులు ఇదే విధమైన ఆలోచనలను ప్రచారము చేయుచున్నారు. జీవపరిణామ శాస్త్రము ఈ సిద్ధాంత ఆధారముగనే జీవుల ఉత్పత్తిని వివరించును. అంతేకాక నాస్తిక బౌద్ధులు కూడా ఇదే వాదనను బలపరచుదురు. కాబట్టి కృష్ణుడు అర్జునుడు కూడా ఆత్మకు ప్రత్యేక ఉనికి లేదని భావించినా దు:ఖించవలసిన అవసరము లేదని తెలియజేయుచున్నాడు. మనము కేవలము రసానయ సమ్మేళనమే అయితే ప్రపంచ యుద్ధాలలో టన్నుల కొలదీ రసాయనాలను వృథా చేస్తున్నారు కాబట్టి ద్రోణుడు భీష్‌ముడి గురించి అర్జునుడు దు:ఖించవలసిన అవసరము లేదు. ఆత్మ ఈ శరీరముతోనే నశించేటట్లయితే పాపము గురించి ఆలోచించవలసిన అవసరము లేదు. అయితే మహాబాహువైన అర్జునుడు, వేదాలను అనుసరించి, క్షత్రియుడిగా తన ధర్మాన్ని నిర్వహిస్తాడని కృష్ణుడు భావించాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement