Monday, November 25, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 4

04
అత్ర శూరా మహేష్వాసా
భీమార్జునసమా యుధి |
యుయుధానో విరాటశ్చ
ద్రుపదశ్చ మహారథ : ||

తాత్పర్యము : ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్దరులు పెక్కురు కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు.

భాష్యము : ద్రోణాచార్యుని ముందు దృష్టద్యుమ్నుడు గొప్ప ఆటంకము కాకపోయినా ఇంకొందరు యోధులు విజయాన్ని పొందుట కష్టతరము చేయగలరని దుర్యోధనుడు భయపడెను. తనకు భీమార్జునుల యుద్ధ నైపుణ్యము తెలియును కనుక మిగిలిన వారిని వారిద్దరితో పోల్చిచెప్పెను.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement