Tuesday, November 26, 2024

గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 1, శ్లోకం 44
44
అహో బ త మహత్‌ పాపం
కర్తుం వ్యవసితా వయమ్‌ |
యద్రాజ్యసుఖలోభేన
హంతుం స్వజనముద్యతా: ||

తాత్పర్యము : అహో ! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుట ఎంత విచిత్రము ! రాజ్యసుఖమును అనుభవింపవలెననెడి కోరికతో మేము స్వజనమును చంపగోరుచన్నాము.

భాష్యము : స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు సొంత కుటుంబీకులైన సోదరుడినో, తండ్రినో లేదా తల్లినో సంహరించే కార్యాలకు పూనుకొనవచ్చును. చరిత్రలో అట్టి సంఘటనలు జరిగినవనటానికి ఎన్నో తార్కాణాలు ఉన్నాయి. అయితే అర్జునుడు, భక్తుడు కనుక సత్ప్రవర్తన కలిగి, నీతి నియమాలకు కట్టుబడి ఉండే వ్యక్తి కనక అటువంటి సంఘటనలకు అవకాశము ఇవ్వకూడదని తగిన చర్యలు తీసుకుంటున్నాడు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement