అధ్యాయం 1, శ్లోకం 43
43
ఉత్సన్నకులధర్మాణాం
మనుష్యాణాం జనార్దన |
నరకే నియతం వాసో
భవతీత్యనుశుశ్రుమ ||
తాత్పర్యము : ఓ కృష్ణా ! ఓ జనార్థనా ! కులధర్మములను నాశనము చేయువారు శాశ్వతముగా నరకవాసము చేయుదురని గురుశిష్య పరంపరానుగతముగా నేను వినియుంటిని.
భాష్యము : అర్జునుడు తన ప్రతిపాదనలను సొంత అనుభవాల ఆధారముతో కాక, తాను ప్రామాణిక వ్యక్తుల నుండి పొందిన జ్ఞానము ఆధారముతో మాట్లాడుచున్నాడు. ఇదే జ్ఞానమును సంపాదించుటకు సరైన మార్గము. జ్ఞానములో స్థిరులైన వారి నుంచి మాత్రమే ఎవరైనా సరైన జ్ఞానమును పొందే అవకాశం ఉన్నది. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారము మనిషి చనిపోయేలోపు తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేయవలసి ఉంటుంది. లేనిచో ఆ పాపాల పర్యవసనాలను అనుభవించటకు నరకమునకు వెళ్ళవలసి ఉంటుంది.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో