Tuesday, November 26, 2024

గీతాసారం

ఆధ్యాయం 6, శ్లోకం 29

సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని |
ఈక్షతే యేగయుక్తాత్మా
సర్వత్ర సమదర్శన: ||

తాత్పర్యము : నిజమైన యోగి నన్ను సర్వజీవుల యందును మరియు సర్వజీవులను నా యందును చూచును. ఆత్మ దర్శియైన అట్టివాడు దేవదేవుడనైన నన్నీ నిక్కముగా సర్వత్రా చూచును.

భాష్యము : ఒక తల్లి తన అందరి బిడ్డలను సమ దృష్టితో చూచును. అదేవిధముగా పరమాత్మ రూపములో అందరి హృదయములో శాశ్వతముగా నుండు భగవంతుడు ఒక కుక్కనైనా, బ్రాహ్మణుడినైనా, ఆస్తికుడినైనా, నాస్తికుడినైనా సమదృష్టితో చూచును. ఇట్టి అవగాహన కలిగిన కృష్ణ చైతన్య యోగి సమదృష్టిని కలిగి ఉంటాడు. అన్ని జీవరాశులు భగవంతుని ఏదో ఒక శక్తిలో భాగము. మన ఇంద్రియములను సేవించినట్లయితే అది మాయ ద్వారా భగవంతుని పరోక్షముగా సేవించినట్లేలెక్క. భగవంతుని ఇంద్రియములను సేవించినట్లయితే భగవంతుడ్ని ప్రత్యక్షముగా సేవించినట్లే లెక్క. ఈ విధముగా అందరూ అన్ని సందర్భాలలో భగవంతుని దాసులేననే దృష్టి కృష్ణచైతన్యవ ంతునిలో సంపూర్ణముగా నుండును.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Advertisement

తాజా వార్తలు

Advertisement