అధ్యాయం 6, శ్లోకం 28
యుంజన్నేవం సదాత్మానం
యోగీ విగతకల్మష: |
సుఖేన బ్రహ్మసంస్పర్శమ్
అత్యంతం సుఖమశ్నుతే ||
తాత్పర్యము : ఆ విధముగా ఆత్మ నిగ్రహుడైన యోగి నిరంతరము యోగము నభ్యసించుచు భౌతిక కల్మషములకు దూరుడై, భగవానుని దివ్యమైన ప్రేమయుత సేవ యందు అత్యున్నతమైన పూర్ణనందస్థితిని పొందును.
భాష్యము : ఆత్మ సాక్షాత్కారమనగా భగవంతునితో మనకు గల సహజ సంబంధాన్ని తెలిసికొనుట. జీవుడు భగవంతునిలో భాగము మరియు ప్రత్యేకమైన అంశ. అతని కర్తవ్యము భగవంతుని దివ్యసేవలో నిమగ్నమగుట. ఈ విధముగా భగవంతునితో సంపర్కములోనికి వచ్చుటనే ‘బ్రహ్మ – సంస్పర్శ’ అందురు.
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో …..