Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 27

ప్రశాంతమనసం హ్యేనం
యోగినం సుఖముత్తమమ్‌ |
ఉపైతి శాంతరజ సం
బ్రహ్మభూతమకల్మషమ్‌ ||

తాత్పర్యము : నా యందు మనస్సు లగ్నమైన యోగి తప్పక ఆధ్యాత్మికానందపు అత్యున్నత పూర్ణత్వమును పొందును. రజోగుణమునకు పరముగా నుండు అతడు పరబ్రహ్మముతో తనకు గల గుణరీతి ఏకత్వము నెరిగి పూర్వ కర్మఫలములన్నింటి నుండియు ముక్తుడగును.

భాష్యము : మనస్సును భగవంతుని పాదపద్మములపైన నిలపకుండా ఎవరూ బ్రహ్మభూత స్థితిని పొందలేరు. ఆ స్థితిలో భౌతిక కల్మషము లేక భగవంతుని దివ్య సేవవలో స్థితులై ఉండవలెను. సవై మన: కృష్ణ పదారవిందే – మనము నిజముగా ఎల్లప్పుడూ భగవంతుని సేవలో నిమగ్నులమవ్వాలన్నా, కృష్ణ చైతన్యులమవ్వాలన్నా – భౌతిక కల్మషాలైన రజోగుణము మరియూ ఇతరముల నుండి విముక్తుడై ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement