Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 26

యతో యతో నిశ్చరతి
యనశ్చంచలమస్థిరమ్‌ |
తతస్తతో నియమ్యైతత్‌
ఆత్మన్యేవ వశం నయేత్‌ ||

తాత్పర్యము : చంచలత్వము మరియు అస్థిరత్వము కారణమున మనస్సు ఎచ్చట పరిభ్రమించినను మనుజుడు దానిని అచ్చట నుండి తప్పక నిగ్రహించి ఆత్మ వశమునకు గొనిరావలెను.

భాష్యము : మనస్సు చంచలమైనది, అస్థిరమైనది. కాని ఆత్మ సాక్షాత్కారము పొందగోరిన యోగి మనస్సునూ తద్వారా ఇంద్రియములను నిగ్రహించవలసి ఉన్నది. అటువంటి వ్యక్తిని గోస్వామి అందురు. దానికి భిన్నముగా మనస్సుచే నియంత్రించబడేవారిని ‘గోదాసు’డు లేదా ‘ఇంద్రియదాసు’డు అందురు. గోస్వామి ఇంద్రియాలను, ఇంద్రియాలకు ప్రభువైన కృష్ణుని సేవలో నియుక్తము చేస్తాడు. ఆ విధముగా పరిశుద్ధమైన ఇంద్రియాల ద్వారా మనస్సును నిగ్రహిస్తాడు. ఇదే యోగాభ్యాసము యొక్క పరిపక్వ స్థితి.

Advertisement

తాజా వార్తలు

Advertisement