Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 19

యథా దీపో నివాతస్థో
నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య
యుంజతో యోగమాత్మన: ||

తాత్పర్యము : గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి, నిగ్రహింపబడిన మనస్సు గల యోగి పరత్త్త్వ ధ్యానమున సదా స్థిరుడై యుండును.

భాష్యము : భగవంతుడ్ని ప్రేమిస్తాడు కనుక భక్తుడు సదా తన ఆరాధ్య భగవానుని స్మరిస్తూ ఆయనను సేవిస్తూ ఆ ధ్యానములో గాలి లేని దీపము ఎంత నిశ్చలముగా స్థిరముగా నుండునో అట్లు ఉండును.

Advertisement

తాజా వార్తలు

Advertisement