Tuesday, November 19, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 16

నాత్యశ్నతస్తు యోగోస్తి
న చైకాంతమనశ్నత: |
న చాతిస్వప్నశీలస్య
జాగ్రతో నైవ చార్జున ||

తాత్పర్యము : ఓ అర్జునా! అతిగా భుజించువానికి లేదా అతి తక్కువ తినువానికి, అతిగా నిద్రించువానికి లేదా తగినంత నిద్ర లేనివానికి యోగి యగుటకు అవకాశము లేదు.

భాష్యము : ఆత్మ, శరీరములను కలిపి ఉంచుటకు సరిపడు ఆహారమును మాత్రమే స్వీకరింపవలెను. ఎక్కువగా స్వీకరించిన, ఎక్కువ నిద్రించి తమో గుణమును పెంపొందించుకుందురు. వారు యోగాభ్యాసమునకు అర్హులు కాలేరు. అలాగే అనవసర ఉపవాసాలు కల్పించుకుని పస్తులు ఉన్నా భగవంతుని నిర్ధేశ్యములని విస్మరించుటచే, అజ్ఞానులై యోగా భ్యాసమునకు అనర్హులగుదురు. మానవులకు భగవంతునిచే నిర్ధేశింపబడిన ధాన్యాలు, కూరగాయలు, ఫలాలు, పాలు వంటివి భగవంతునికి అర్పించి స్వీకరించే భక్తుడు, శాస్త్ర నియమములననుసరించి నిద్రను, ఉపవాసాన్ని పాటిస్తున్నాడు కనుక అతనికి యోగాభ్యాసములో పరిపూర్ణత సాధించే అవకాశము ఉన్నది. ఇక మాంసాహారము, మధ్యము, ధూమ్రపానము చేయువారు లేదా తమ ఆనందము కోసమే భుజించేవారు యోగాభ్యాసానికి పనికిరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement