Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 10

యోగీ యుంజీత సతతమ్‌
ఆత్మానం రహసి స్థిత: |
ఏకాకీ యతచిత్తాత్మా
నిరాశీరపరిగ్రహ: ||

తాత్పర్యము : యోగియైనవాడు తన దేహమును, మనస్సును, ఆత్మను సదా భగవంతుని సంబంధములోనే నియక్తము చేసి, ఒంటరిగా ఏకాంతస్థలము నందు నివసించుచు సావధానముగా మనస్సును నియమింపవలెను. అతడు కోరికల నుండియు మరియు సమస్తమును కలిగియుండవలెనను భావనల నుండియు ముక్తుడై యుండవలెను.

భాష్యము : ఆత్మ సాక్షాత్కారానికి ప్రయత్నించే వారిలో కొందరు కృష్ణుని తేజో కాంతమైన బ్రహ్మముకు ఆకర్షితులైన బ్రహ్మవాదులైతే మరికొందరు కృష్ణుని హృదయస్థ రూపమైన పరమాత్మకు ఆకర్షింపబడే యోగులు, ఒక భక్తులు మాత్రము దేవాదిదేవుడైన శ్రీకృష్ణునికి ఆకర్షింపబడతారు. వారు కృష్ణుడు బ్రహ్మము, పరమాత్మలకే కాక సర్వానికి మూలమని తెలిసికొని ఉంటారు. అటువంటి సంపూర్ణ జ్ఞానమును కలిగి వుంటారు కనుక వారు సర్వోత్తమ ఆధ్యాత్మిక వాదులు. సర్వమూ కృష్ణునికే సంబంధించినదని తెలిసిన భక్తుడు కేవలము కృష్ణునని సేవకు ఏది అనుకూలమో దానిని స్వీకరించి, మిగిలిన వాటిని తిరస్కరిస్తాడు. ఈ విధముగా తన కోసము అంటూ ప్రత్యేకంగా దేని కోసమూ ఆరాటపడడు. ఈ విధముగా బౌతిక సాంగత్యానికి దూరముగా ఉండి భగవంతునిపైనే మనస్సును లగ్నపరచి సమాధిని పొందుతాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement