Tuesday, November 19, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 8

జ్ఞానవిజ్ఞానతృప్తాత్మా
కూటస్థో విజితేంద్రి య: |
యుక్త ఇత్యుచ్యతే యోగీ
సమలోష్టాశ్మకాంచన: ||

తాత్పర్యము : మనుజుడు తాను పొందినటువంటి జ్ఞాన, విజ్ఞానములచే సంపూర్ణముగా సంతృప్తి చెందినపుడు ఆత్మానుభవము నందు స్థితిని పొందినట్టివాడై యోగి యనబడును. అట్టివాడు ఆధ్యాత్మికస్థితి యందు నెలకొని ఆత్మనిగ్రహమును కలిగియుండును. అతడు గులకరాళ్ళనైనను, రాళ్ళనైనను లేదా బంగారమునైనను సమానముగా చూచును.

భాష్యము : కేవలము శాస్త్రాలను చదవటం చేత ఎవరూ ఆత్మ సాక్షాత్కారాని ్న పొందలేరు. ఎందువలనంటే శాస్త్రము నందుండే పరస్పర విరుద్ధ భావాలు అటువంటి వారిని కలవరపరచి, తికమకలు పెట్టి పెడత్రోవ ప ట్టిస్తాయి. కాబట్టి శుద్ధ భక్తిలో సంపూర్ణ ఆనందమును చవి చూస్తున్న ఆత్మదర్శిని, భగవత్‌ కృపా పాత్రుడిని కలుసుకొనుట అనేది జీవి యొక్క భాగ్యమనే చెప్పవచ్చును. కృష్ణునికి శరణాగతుడు కావటం చేత అతడు దృఢమైన విశ్వాసాన్ని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉంటాడు. జ్ఞాన సముపార్జన, మానసిక కల్పనా చాతుర్యము కొందరికి బంగారము వలే విలువ కలిగినది కావచ్చునేమోగాని, అటువంటి వ్యక్తికి అవి రాళ్లు రప్పల వలే విలువ లేనివి మాత్రమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement