Friday, November 22, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 6

బంధురాత్మాత్మనస్తస్య
యేనాత్మైవాత్మనా జిత: |
అనాత్మనస్తు శత్రుత్వే
వర్తేతాత్మైవ శత్రువత్‌ ||

తాత్పర్యము : మనస్సు జయించినవానికి మనస్సే ఉత్తమ మిత్రుడు. కాని అట్లు చేయలేనివానికి అతని మనస్సే గొప్ప శత్రువుగా వర్తించునను.

భాష్యము : జీవి యొక్క సహజస్థితి ఉన్నతమైన వ్యక్తి యొక్క ఆదేశాలను శిరసా వహించటం. యోగము యొక్క ఉద్దేశ్యము మనస్సుని నియంత్రించి మిత్రుడిగా చేసుకుని, జీవుని తన సహజ స్థితిలో నిలుపుట, ఇదే మానవ జీవన లక్ష్యము. అయితే నామమాత్రపు యోగము పాటిస్తున్నప్పుడు మనస్సు అదుపు తప్పి అది గొప్ప శత్రువై జీవుని కామ, క్రోధ, మోహ, మద, మాత్సర్యాలకు బానిసనున చేసి మానవ జీవిత ఉద్దేశ్యాన్ని భంగ పరుస్తుంది. కాబట్టి నిజమైన యోగము హృదయమునందున్న పరమాత్మతో సంబంధాన్ని నెలకొల్పి, ఆయన ఆజ్ఞలను పాటించునట్లు చేయునది. అది కృష్ణ చైతన్య వంతునికి సులభ సాధ్యము.

Advertisement

తాజా వార్తలు

Advertisement