అధ్యాయం 6, శ్లోకం 5
ఉద్ధరేదాత్మనాత్మానం
నాత్మానమవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధు:
ఆత్మైవ రిపురాత్మాన: ||
తాత్పర్యము : ప్రతియొక్కడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్దరించుకొనవలెనే గాని అధోగతిపాలు చేసికొనరాదు. బద్ధ జీవునికి మనస్సు అనునది మిత్రుడును అలాగుననే శత్రువును అయియున్నది.
భాష్యము : ఆత్మ లేదా మనస్సు, అహంకారము వలన ఈ భౌతిక ప్రకృతిపై అధికారము చెలయించాలనే ప్రయత్నము చేత పవిత్రమైన ఆత్మ బంధనానికి లోనౌతుంది. ఈ భౌతిక ప్రపంచపు ఆకర్షణలకు బానిక కాకుండా మనస్సుకు శిక్షణ ఇచ్చినట్లయితే ఆత్మను రక్షించవచ్చును. కాబ ట్టి మనస్సును సదా కృష్ణ చైతన్యములో నిమగ్నము చేసినట్లయితే మిగిలిన ఆక ర్షణలకు దూరంగా ఉండటం వలన పతనము కాకుండా నివారించవచ్చు.