Tuesday, November 26, 2024

గీతాసారం (ఆడియోతో…)

అధ్యాయం 6, శ్లోకం 3

ఆరురుక్షోర్మునేర్యోగం
కర్మ కారణముచ్యతే |
యోగారూఢస్య తస్యైవ
శమ: కారణముచ్యతే ||

తాత్పర్యము : అష్టాంగ యోగపద్ధతి యందు ఆరంభ స్థితిలో నున్న యోగికి కర్మము సాధనముగా చెప్పబడగా, యోగము నందు సిద్ధిని పొందినవానికి భౌతికకర్మల విరమన సాధనముగా చెప్పబడినది.

భాష్యము : శ్రీ కృష్ణ భగవానునితో సంబంధమును ఏర్పరచుకొను పద్ధతియే యోగమని పిలువబడును. దానిని తరచుగా నిచ్చెనతో పోల్చుదురు. ఆ యోగనిచ్చెన యొక్క ఆరంభము ”యోగారురుక్షువు” స్థితియనియు, దాని చివరిమెట్టు ”యోగారూడము” అని పిలువబడును. ఆరంభ దశలో వివిధ నియమములు ద్వారా మరియు వివిధ ఆసనముల ద్వారా ధ్యానము నందు ప్రవేశించుటకు చేయు అష్టాంగ యోగామందలి పద్ధతులు కామ్యకర్మలనియే భావింపబడును. కాని అవి క్రమముగా కలత పెట్టే మనోకర్మల నుండి దూరము చేసి పరిపూర్ణ మానసిక సమతుత్యతను సాధించును. కృష్ణభక్తుడు శ్రీకృష్ణుని సదా సేవించుటవలన మరియు ఆయన గురించే ఆలోచించుట వలన అతను మొదటి నుండే ధ్యానస్థితి యందు నెలకొని యున్నాడని భావింపవచ్చును.

Advertisement

తాజా వార్తలు

Advertisement